: ఏదైతే బలహీనత అన్నారో...దానినే బలంగా మార్చుకున్నాడు!
బాగా ఎత్తున్న అబ్బాయిలు అమ్మాయిలను ఆకర్షిస్తారని పలు సర్వేలు గతంలో వెల్లడించాయి. అయితే, 'ఎత్తు'గడ మాత్రం ధర్మేంద్ర సింగ్ పాలిట శాపంగా మారింది. ఎంఏ హిందీ లిటరేచర్ చదివిన ధర్మేంద్ర 8.1 అడుగుల ఎత్తుంటాడు. అతని ఎత్తు కారణంగా అతనికి ఎవరూ ఉద్యోగం ఇవ్వలేదట. దీంతో ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ కు చెందిన ఇతను తిరునాళ్లకు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. బాగా ఎత్తుగా ఉండడంతో అతనితో ఫోటోలు దిగేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారట. ఇలా ఫోటో దిగాలంటే పది రూపాయలు ఇవ్వాలని టికెట్ పెట్టాడు. దీంతో అతనితో ఫోటో దిగేవాళ్లంతా పది రూపాయలు చెల్లించి ఫోటో దిగుతున్నారు. ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా దొరకడం లేదని, ఇదే జీవిన భృతిగా మారిందని ధర్మేంద్ర పేర్కొన్నాడు.