: ఎంపీగా ఒవైసీ అనర్హుడు... రాష్ట్రపతికి లేఖ రాస్తాం: కిషన్ రెడ్డి


ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా అనర్హుడంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్లమెంటు సభ్యుడిగా తగరంటూ విమర్శించారు. బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్ పేయికి భారతరత్న ఇవ్వడాన్ని ఒవైసీ ఎలా ప్రశ్నిస్తారని, అది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. తన వ్యాఖ్యల ద్వారా ఒవైసీ... రాజ్యాంగాన్ని, రాష్ట్రపతిని కించపరిచారంటూ పేర్కొన్నారు. ఈ విషయమై రాష్ట్రపతికి, లోక్ సభ స్పీకర్ కు లేఖ రాస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News