: టెక్సాస్ లోని ఆర్ట్ ఫెయిర్ పై దాడి చేసింది మేమే: ఐఎస్ఐఎస్
అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన ఆర్ట్ ఫెయిర్ పై దాడి చేసింది తామేనని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్రకటించింది. ఈ ఫెయిర్ లో ప్రదర్శించిన కార్టూన్లు మహమ్మద్ ప్రవక్తను అవమానించే విధంగా ఉన్నాయని ఐఎస్ ఉగ్రవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖలీఫాకు చెందిన ఇద్దరు సైనికులు ఎల్టన్ సింప్సన్, నాదిర్ సూఫీలు ఈ దాడిలో పాల్గొన్నారని చెప్పారు. తమ అధికారిక రేడియోలో ఐసిస్ ఈ వివరాలను తెలిపింది. అయితే, భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో వీరిద్దరూ చనిపోయిన సంగతి తెలిసిందే.