: ఆర్టీసీ కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించిన ఏపీ ప్రభుత్వం
ఫిట్ మెంట్ విషయంలో సమ్మెకు నోటీసు ఇచ్చిన ఆర్టీసీ కార్మిక సంఘాలను ఏపీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. మరికాసేపట్లో వారితో రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు చర్చలు జరపనున్నారు. వారితో చర్చలు జరిపి సమ్మె విరమింపజేస్తామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మికులు సమ్మెకు వెళితే 64 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిపారు. ఒకవేళ కార్మికులు సమ్మెకు వెళితే కనుక, ప్రయాణికుల కోసం ప్రైవేట్ బస్సులు, రైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సీఎం చంద్రబాబు ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.