: శిక్షపడ్డా... ఇప్పట్లో సల్మాన్ జైలుకెళ్లడులే... నిర్మాతల అభిప్రాయం


ఓ ప్రముఖ బాలీవుడ్ హీరోకు జైలుశిక్ష పడితే అతడిపై పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతలు ఎంతో ఆందోళనకు గురవుతారు. కానీ, సల్మాన్ ఖాన్ విషయంలో నిర్మాతలు భయపడడం లేదు. ఈ కండల వీరుడిని నమ్ముకుని రూ. 200 కోట్లకు పైగా చిత్రసీమలో పెట్టుబడిగా ఉన్నప్పటికీ, భయపడడం లేదని ఫిలిమ్ ఇండస్ట్రీ నిపుణులు అమోద్ మెహ్రా అంటున్నారు. ఇండియాలో న్యాయ ప్రక్రియ నిదానంగా సాగుతుండడం అందరికీ తెలిసిందేనని అన్న ఆయన, తీర్పు వెలువడిన వెంటనే సల్మాన్ జైలుకెళ్లే పరిస్థితి ఉండదని విశ్లేషించారు. బెయిలు, పైకోర్టు వంటి ఎన్నో ఆప్షన్లు ఆయన ముందున్నాయని, దీనివల్ల నిర్మాతలు భయపడే ప్రశ్న తలెత్తదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News