: లోకేశ్ ఏ హోదాలో అమెరికా వెళ్లారు?: తలసాని
ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్ అమెరికా పర్యటనపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నలు సంధించారు. ఏ హోదాలో ఆయన అమెరికా వెళ్లారని అడిగారు. లోకేశ్ వెంట సీఎం ఓఎస్ డీ కూడా ఎందుకు వెళ్లినట్టు అని ప్రశ్నించారు. కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించడంపై వస్తున్న విమర్శలను తలసాని ఖండించారు. పనీపాట లేనివాళ్లే విమర్శలు చేస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం కోట్లు ఖర్చుపెట్టి యోగా తరగతులు ఎలా నిర్వహించిందని సూటిగా అడిగారు. సీపీ మహేందర్ రెడ్డి, సదారామ్ లు క్లాసులు చెబితే తప్పేంటన్నారు.