: ఆ పాత్రలో నన్ను నేను చూసుకుని మురిసిపోయా: సెన్సార్ బోర్డు మాజీ ఛైర్ పర్సన్
"ఓకే కన్మణి' సినిమా ద్వారా తొలిసారి వెండితెరపై నన్ను నేను చూసుకుని మురిసిపోయా"నని సెన్సార్ బోర్డ్ మాజీ ఛైర్ పర్సన్ లీలా సామ్సన్ చెప్పారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, మణిరత్నం తనకు ఫోన్ లో కథ చెప్పారని అన్నారు. ఆడిషన్ లో పాల్గొన్న వారానికి ఆ పాత్రకు తనను ఖరారు చేశారని ఆమె చెప్పారు. తెరమీద చూసుకుని మురిసిపోయానని ఆమె వెల్లడించారు. తొలి సినిమాలోనే ప్రకాశ్ రాజ్ లాంటి నటుడితో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. కాగా, మణిరత్నం తాజా సినిమా 'ఓకే కన్మణి' సినిమాలో భవానీ పాత్రలో ఆమె ఆకట్టుకున్నారు.