: రాధికా ఆప్టేకు శ్వేతాబసు బాసట


హీరోయిన్ రాధికా ఆప్టే న్యూడ్ వీడియో అంటూ ఇటీవల ఓ క్లిప్పింగ్ ఆన్ లైన్ లో దుమారం రేపింది. ఆ వీడియో తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయినా, రాధికా ఆప్టే మాత్రం తేలిగ్గా తీసుకుంది. అనురాగ్ కాశ్యప్ దర్శకత్వంలో వస్తున్న ఓ షార్ట్ ఫిల్మ్ లో ఆప్టే నగ్నంగా కనిపించే సన్నివేశాలున్నాయి. వాటి తాలుకూ వీడియోనే లీకయింది. ఈ నేపథ్యంలో, రాధికాకు యువనటి శ్వేతాబసు ప్రసాద్ బాసటగా నిలిచింది. వీడియో లీకవడం దురదృష్టకరమని, చాలా బాధాకరమని పేర్కొంది. ఆ షాట్ చిత్రీకరణ సమయంలో సెట్ పై ఇద్దరు మహిళలే ఉన్నారని, వారిలో ఒకరు రాధికా ఆప్టే అని, మరో వ్యక్తి తానేనని శ్వేతా వెల్లడించింది. అదో సున్నితమైన సన్నివేశం కావడంతో మహిళలు తప్ప ఎవరూ సెట్ పై ఉండకుండా అనురాగ్ కాశ్యప్ జాగ్రత్తలు తీసుకున్నాడని వివరించింది. ఆ సన్నివేశాల్లో రాధికా ఆప్టే నటన అద్భుతమని పేర్కొంది.

  • Loading...

More Telugu News