: మృత్యు దిబ్బ... ఒకే గ్రామంలో మంచుచరియల కింద 100కు పైగా మృతదేహాలు


నేపాల్ ను వణికించిన భూకంపం ఒక గ్రామాన్ని నామరూపాల్లేకుండా చేసింది. భూకంపం సమయంలో మంచు పర్వత చరియలు విరిగిపడడంతో ట్రెక్కింగ్ చేసేవాళ్లు విశ్రాంతి తీసుకునే ఆ గ్రామం సర్వనాశనమైంది. ఖాట్మాండుకు 60 కిలోమీటర్ల దూరంలోని లాంగ్ తాంగ్ గ్రామానికి సహాయక బృందాలు వెళ్లి చూస్తే అక్కడ మృత్యు దిబ్బ కనిపించింది. మంచు కింద మృతదేహాలు గడ్డకట్టుకుపోయి ఉన్నాయి. ఈ గ్రామంలో 55 వరకూ గెస్ట్ హౌస్ లు, వాటి నిర్వహణ నిమిత్తం కొందరు స్థానికులు ఉంటారని, ఇప్పటివరకూ 100కు పైగా మృతదేహాలను వెలికితీశామని, ఇక్కడ ఉండాల్సిన మరెంతో మంది కనిపించడం లేదని అధికారులు తెలిపారు. మృతదేహాల్లో ఏడుగురు విదేశీయులు ఉండగా, ఇద్దరినే గుర్తించినట్టు తెలిపారు. భూకంపం వచ్చిన సమయంలో లాంగ్ తాంగ్ లో ఎంతమంది ఉన్నదీ స్పష్టంగా తెలియడం లేదని అధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News