: కేసీఆర్ ఆస్తులపై ప్రజల్లో అనుమానాలున్నాయి: షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు
నైతిక విలువల గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్... ఆయన ఆస్తులపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని టీకాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. కేసీఆర్ ఆస్తులపై ప్రజల్లో అనేక అనుమానాలున్నాయని చెప్పారు. కేసీఆర్ చెబుతున్న నీతులకు, ఆచరిస్తున్న విధానాలకు పొంతన లేదని విమర్శించారు. కేసీఆర్ కు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. తన కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లోకి రారని చెప్పిన కేసీఆర్... మొత్తం కుటుంబాన్ని రాజకీయాల్లోకి దించేశారని మండిపడ్డారు.