: తలసాని శ్రీనివాస్ బతుకేందో అందరికీ తెలుసు... ఆలుగడ్డల యాదవ్ అని కూడా తెలుసు: ఎర్రబెల్లి


ఇటీవలే టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి జంప్ చేసి రాష్ట్ర మంత్రి పదవి చేపట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పై టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా తమ అధినేత చంద్రబాబు లేఖ ఇచ్చేందుకు సిద్ధమైతే... లేఖ ఇవ్వవద్దని తలసాని అడ్డుపడ్డారని ఆరోపించారు. పచ్చి తెలంగాణ ద్రోహి అని దుయ్యబట్టారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ బతుకు అందరికీ తెలుసని... రాజకీయాల్లోకి రాకముందు ఆయన పేరు ఆలుగడ్డల యాదవ్ అని కూడా తెలుసని ఎద్దేవా చేశారు. తన కుటుంబం మొదటి నుంచి పరపతి కలిగిన కుటుంబమని చెప్పారు. కేసీఆర్ మంత్రివర్గం తెలంగాణ వ్యతిరేకులతో నిండిపోయిందని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News