: 'స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్' లోగో పోటీ... ఉత్తమ లోగోకు నగదు బహుమతి


'స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమం కోసం లోగో పోటీ నిర్వహించబోతున్నట్టు జీహెచ్ ఎంసీ ప్రకటించింది. అందమైన, ఆకర్షణీయమైన లోగో రూపొందించినవారికి రూ.51వేల నగదు బహుమతి అందజేస్తామని కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ చిహ్నం, హైదరాబాద్ నగర విశిష్టతను తెలియజేస్తూ, కార్యక్రమ ఉద్దేశాలు, లక్ష్యాలు సామాన్యులకు సైతం సులువుగా అర్థమయ్యేలా లోగో రూపొందించాలని కమిషనర్ సూచించారు. ఆసక్తి ఉన్న వారు జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయానికి ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు లోగో డిజైన్ హార్డ్, సాఫ్ట్ కాపీలు సీల్డ్ కవర్ లో అందజేయాలని వివరించారు. అయితే లోగో ప్రొఫెషనల్ గా తక్కువ పరిమాణంలో ఉండాలన్నారు. ఎంపిక విషయంలో చివరి నిర్ణయం జీహెచ్ఎంసీ వారిదేనని చెప్పారు. ఈ నెల 16 నుంచి స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News