: హైదరాబాద్ లోని అబిడ్స్ లో తపాల శాఖ ఏటీఎం ప్రారంభం
హైదరాబాద్ లోని అబిడ్స్ లో ఉన్న తపాల శాఖ ప్రధాన కార్యాలయంలో తపాలా ఏటీఎం ప్రారంభమైంది. చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ సుధాకర్ దానిని ప్రారంభించారు. త్వరలో తెలంగాణ, ఆంధ్రాలో మరిన్ని తపాలా ఏటీఎంలు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. నాలుగు రోజుల కిందట విజయవాడలో తొలి తపాలా ఏటీఎంను ప్రారంభించిన సంగతి తెలిసిందే.