: రిలయన్స్ ను ఢీ కొట్టేందుకు... భారతితో చేతులు కలిపిన బియానీ!


దేశీయ రిటైల్ రంగంలో మొన్నటిదాకా బిగ్ బజార్ దే హవా. అగ్రస్థానం కూడా. కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ బిగ్ బజార్ లను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. అయితే రిలయన్స్ ఫ్రెష్ ఎంట్రీతో బిగ్ బజార్ నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం దేశంలో రిటైల్ రంగంలో రిలయన్స్ ఫ్రెష్ దే అగ్రస్థానం. అయితే మునుపటి నెంబర్ వన్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు కిశోర్ బియానీ చేసిన కసరత్తు ఎట్టకేలకు ఫలించింది. ఫ్యూచర్ గ్రూప్ తో జతకట్టి రిలయన్స్ అగ్రాసనానికి చెక్ పెట్టేందుకు భారతి ఎంటర్ ప్రైజెస్ సంస్థ చీఫ్ సునీల్ భారతి మిట్టల్ ముందుకొచ్చారు. ఫ్యూచర్ గ్రూప్, భారతి ఎంటర్ ప్రైజెస్ ల సంయుక్త ఆధ్వర్యంలో కొత్తగా ‘ఫ్యూచర్ రిటైల్’ రాబోతోంది. ఈ కంపెనీ ఛత్రం కిందే ఇకపై బిగ్ బజార్ తదితర ఫ్యూచర్ గ్రూప్ విభాగాలన్నీ కార్యకలాపాలు సాగిస్తాయి. కొత్తగా తెరపైకి రానున్న ఫ్యూచర్ రిటైల్ టర్నోవర్ రూ.15,000 కోట్లుగా ఉంటుందట. కొత్త సంస్థలో సునీల్ మిట్టల్ కు 15 శాతం వాటా ఉంటే, బియానీకి 46-47 శాతం వాటా ఉంటుందని మార్కెట్ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News