: ధోనీ సినిమా కథ మళ్లీ మారుతోంది


భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా నిర్మితమవుతున్న సంగతి తెలిసిందే. ఏడాది క్రితం ప్రారంభమైన ఈ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కథలో మార్పులు, చేర్పుల మూలంగా షూటింగ్ పూర్తికావడం లేట్ అవుతోంది. టెస్ట్ మ్యాచ్ ల నుంచి రిటైర్ అవుతున్నట్టు ధోనీ ప్రకటించిన తర్వాత... కథలో ఒకసారి మార్పులు చేశారు. ఇటీవల ప్రపంచ కప్ సెమీస్ లో ఇండియా ఓడిపోవడం, ధోనీకి కూతురు పుట్టడంలాంటి అంశాల నేపథ్యంలో, కథలో మరిన్ని మార్పులు అవసరమని భావించి, స్క్రిప్టును మారుస్తున్నారు. దీంతో, షూటింగ్ పూర్తికావడం మరింత లేట్ కానుంది.

  • Loading...

More Telugu News