: అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఓ మంత్రికి ముడుపులు అందాయి: దేవినేని నెహ్రూ


అగ్రిగోల్డ్ వ్యవహారంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రికి రూ.20 కోట్ల ముడుపులు అందాయని ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని నెహ్రూ ఆరోపించారు. ఈ సంస్థ ఖాతాదారుల చీటింగ్ కేసులో సీఐడీ దర్యాప్తు అంటూ తొలుత హడావిడి చేశారని, తరువాత అగ్రిగోల్డ్ నుంచి ముడుపులు తీసుకున్నారన్నారు. అందుకే బాధితుల తరపున నోరు మెదపడంలేదని విమర్శించారు. త్వరలో ఆధారాలతో అన్ని విషయాలను బయటపెడతానని నెహ్రూ చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా నిలుస్తామన్నారు. సీఎం చంద్రబాబుతో కలిసి చైనా వెళ్లిన వారిలో 10 మంది ఆర్థిక నేరస్తులున్నారని, వారిని ఫ్రత్యేక విమానంలో తీసుకెళ్లి ఏపీ పరువు తీశారని మండిపడ్డారు. వారి పేర్లను కూడా త్వరలోనే బయటపెడతానని నెహ్రూ స్పష్టం చేశారు. బలవంతంగా భూసేకరణ చేస్తే ప్రజల నుంచి ప్రభుత్వానికి ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News