: ఇండియాకు ఆ భయం లేదు!
పపువా న్యూ గినియాలో ఈ ఉదయం భూకంపం సంభవించిన తరువాత సముద్రంలో సునామీ రావచ్చని హెచ్చరికలు వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే, భారత తీరానికి సునామీ ముప్పు లేదని ఐటీఈడబ్ల్యూసీ (ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్) స్పష్టం చేసింది. హిందూ మహా సముద్రంలో సునామీ రాబోదని తెలిపింది. కాగా, పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం మాత్రం భూకంప కేంద్రానికి 300 కి.మీ పరిధిలో సునామీ అలలు తీరాన్ని తాకి విధ్వంసం సృష్టించవచ్చని, ప్రజలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.