: ఛత్తీస్ గఢ్ లో రెచ్చిపోయిన మావోలు... సీఆర్పీఎఫ్ జవాన్లు లక్ష్యంగా మందుపాతరలు
ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఓ వైపు ఈ నెల 9న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైన వెనువెంటనే, రాష్ట్రంలోని మద్వాడా అటవీ ప్రాంతంలో మావోలు మందుపాతరలను పేల్చారు. తమ కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా ఒకేసారి నాలుగు మందుపాతరలను పేల్చారు. అయితే ఈ ప్రమాదం నుంచి సైనికులు త్రుటిలో తప్పించుకున్నారు. దీంతో పెను ముప్పే తప్పింది. జవాన్లను లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతోనే మావోలు ఈ మందుపాతరలను పేల్చేశారని ఆ రాష్ట్ర పోలీసులు అనుమానిస్తున్నారు.