: లోకేశ్, కేటీఆర్ లు ఉన్నతస్థాయి బిచ్చగాళ్లు: సీపీఐ నారాయణ
నారా లోకేశ్, కేటీఆర్ ల అమెరికా పర్యటనలపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. వాళ్లిద్దరూ హైక్లాస్ బెగ్గర్లుగా మారారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. రైతులకు ఇష్టం లేకుండా భూములు లాక్కుని రాజధాని నిర్మిస్తే అది శ్మశానంపై నిర్మించినట్టే అవుతుందని మండిపడ్డారు. అనంతపురంలో హ్యతలకు ప్రభుత్వ కార్యాలయాలు అడ్డాగా మారాయని నారాయణ ఆరోపించారు. ఇటీవల వైఎస్సార్సీపీ నేత భూమిరెడ్డి శివప్రసాదరెడ్డిని రాప్తాడు ప్రభుత్వ కార్యాలయంలో హత్య చేయడం దారుణమన్నారు.