: మహారాష్ట్రలో పలువురు ఆప్ నేతలు, కార్యకర్తల రాజీనామా
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లకు మహారాష్ట్రకు చెందిన పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. అందులో భాగంగా దాదాపు 350 మంది నేతలు, కార్యకర్తలు రాజీనామా చేశారు. "350 మంది పార్టీ వాలంటీర్లు, నేతలు ఆప్ కు రాజీనామా చేశారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది" అని మహారాష్ట్ర ఆప్ యూనిట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మాజీ సభ్యుడు మారుతీ భప్కర్ అన్నారు. తామిప్పుడు యాదవ్, భూషణ్ లతో ఉన్నామని, స్వరాజ్ భావనను దేశవ్యాప్తంగా మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.