: హైకోర్టును విభజించండి... పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీల నిరసన


రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల కేసులను విచారిస్తున్న ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టును విభజించాలనే డిమాండ్ తెలంగాణవాదుల నుంచి బలంగా వినిపిస్తోంది. దీనిపై ఇప్పటికే హైకోర్టులోని టీ లాయర్లు కోర్టు ప్రాంగణంలో పలుమార్లు ధర్నాలకు దిగారు. అయితే ‘‘ఉన్నంతకాలం ఉమ్మడిగానే’’ అంటూ ఇటీవల హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ పరిధిలో ఉన్న ప్రస్తుత కోర్టు తెలంగాణకు చెందినదేనని, ఏపీ హైకోర్టునే వేరే చోట నిర్మించాల్సి ఉందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. కొత్త కోర్టు కూడా సంబంధిత రాష్ట్రం పరిధిలోనే ఉండాలని కూడా సూచించింది. దీంతో హైకోర్టు విభజన ఆలస్యం కానుందని తేలడంతో రంగంలోకి దిగిన టీఆర్ఎస్ ఎంపీలు కొద్దిసేపటి క్రితం పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు. హైకోర్టును తక్షణమే విభజించాలని వారు నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News