: కేంద్ర పురస్కారాలకు కూడా మతం రంగు పులుముతారా?: ఎంఐఎంపై ముఖ్తార్ అబ్బాస్ ఫైర్


వాజ్ పేయికి భారతరత్న, అద్వానీకి పద్మవిభూషణ్ ఇవ్వడాన్ని తప్పుబట్టిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ మండిపడింది. దేశ అత్యున్నత పురస్కారాలకు కూడా మతం రంగు పులమడానికి అసద్ ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎంఐఎం దృష్టిలో ఒసామా బిన్ లాడెన్ లాంటి వారికి పురస్కారాలు ఇవ్వాలేమో!' అంటూ ఎద్దేవా చేశారు. కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారానే రాజకీయాల్లో ఎదగాలనుకునే వారు ఇలాంటి వ్యాఖ్యలనే చేస్తారని నఖ్వీ విమర్శించారు. దేశానికి ఎంతో సేవ చేసిన వారంటే అసద్ కు గిట్టదని... చెడు చేసేవారే వారికి ఇష్టమని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News