: ఈ నెలలో మోదీ విదేశీ పర్యటనలివే
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ ఏడాదిలో మరోసారి విదేశీ పర్యటనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి కూడా వరుసగా మూడు దేశాల్లో పర్యటన ఉంటుంది. ఈ నెల 14 నుంచి 16 వరకు చైనాలో పర్యటిస్తారు. అందులో భాగంగా జియాన్, బీజింగ్, షాంఘైలలో మోదీ పర్యటన ఉంటుంది. 17న మంగోలియా వెళతారు. ఓ భారత ప్రధాని ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నెల 18, 19 తేదీల్లో దక్షిణ కొరియాలో ప్రధాని పర్యటన ఉంటుంది. ఆ దేశాలతో భారత్ సంబంధాలు వంటి పలు అంశాలపై ప్రధాని చర్చిస్తారు.