: ఓ హైదరాబాదీ అతి ప్రేమ... మరణించిన ప్రియురాలి అస్థికల దొంగతనం


ప్రేమించిన ప్రియురాలితో జీవితం పంచుకోలేకపోయిన ఓ యువకుడు కనీసం ఆమె అస్థికలైనా సొంతం చేసుకోవాలని భావించి శ్మశానానికి వెళ్లి దహన సంస్కారాలు జరిగిన ప్రదేశంలోని అస్థికలు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన హైదరాబాద్, అంబర్ పేట భరత్ నగర్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతానికి చెందిన డప్పు సాయిరామకృష్ణ, మహేశ్వరిలు ప్రేమించుకున్నారు. గత నెల 22న భరించలేని కడుపునొప్పితో బాధపడలేక మహేశ్వరి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, ఈ నెల 2న దహన సంస్కారాలు జరిగాయి. అస్థికలు సేకరించేందుకు బంధువులు వెళ్లగా ఖాళీ స్థలం కనిపించింది. కాటికాపరులను ప్రశ్నించగా, రామకృష్ణతో పాటు మరో ఇద్దరు వచ్చి అస్థికలు తీసుకువెళ్లారని చెప్పారు. ఆమె తన భార్యని కూడా చెప్పినట్టు తెలిపారు. ఈ ఘటనపై మహేశ్వరి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, మహేశ్వరి మరణించిన రోజు రామకృష్ణ పోలీసుల వద్దకు వచ్చి, ఆమెను ప్రేమించానని, తాను కూడా చనిపోతానని బాధపడగా, పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

  • Loading...

More Telugu News