: ‘కింగ్స్’పై విజయం ప్రేయసికే అంకితం...ట్విట్టర్ లో ముంబై కెప్టెన్ రోహిత్
టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రేమలో మునిగిపోయాడు. మైదానంలో తనదైన రోజున బ్యాట్ తో వీరవిహారం చేసే రోహిత్, ఇప్పటికే ప్రపంచ క్రికెట్ లో వేరెవ్వరికీ సాధ్యం కాని రెండు డబుల్ సెంచరీలను అలవోకగా బాదాడు. తన స్నేహితురాలు రితికతో ఎంగేజ్ మెంట్ కార్యాన్ని పూర్తి చేసుకున్న అతడు, ఆమెతో పెళ్లికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఎంగేజ్ మెంట్ తంతు ముగిసిన ఒక రోజులోనే తన కాబోయే భార్యపై ప్రేమను ఒలికించడంలోనూ అతడు తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ విషయంలో అతడు ఏమాత్రం సంకోచించడం లేదు. మొన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పై ముంబై నెగ్గిన విషయం తెలిసిందే. సదరు విజయాన్ని తన ప్రేయసి రితికకు అంకితమిస్తున్నట్లు అతడు ప్రకటించాడు. ఈ మేరకు అతడు ట్విట్టర్ వేదికగా ఈ వ్యాఖ్య చేశాడు.