: మెవెదర్ దొంగ దెబ్బ తీశాడు... అందుకే ఓడిపోయా: పకియావ్ సంచలన ప్రకటన


ప్రపంచ బాక్సింగ్ చరిత్రలోనే అత్యంత ఖరీదైనదిగా భావిస్తున్న మొన్నటి బౌట్ కు సంబంధించి ఓటమిపాలైన పకియావ్ నిన్న సంచలన వ్యాఖ్య చేశాడు. విజేతగా నిలిచిన మెవెదర్ దొంగ దెబ్బ తీసిన కారణంగానే తాను ఓడిపోయానని అతడు వ్యాఖ్యానించాడు. బౌట్ ముగిసిన తర్వాత సొంత దేశం పిలిప్పీన్స్ వెళ్లిన అనంతరం పకియావ్ ఈ వ్యాఖ్య చేశాడు. తాను గాయంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న మెవెదర్, సదరు గాయం ఉన్న ఎడమ చేతిని పలుమార్లు లాగాడని ఆరోపించాడు. తాను గాయంతో బాధపడుతున్న విషయాన్ని గోప్యంగానే ఉంచినా, మెవెదర్ శిబిరం ఈ విషయాన్ని తమ శిబిరంలోని వ్యక్తి ద్వారా తెలుసుకుని ఉంటుందని కూడా అతడు ఆరోపించాడు. అయితే పకియావ్ ఆరోపణలను మెవెదర్ శిబిరం మాత్రం కొట్టిపారేసింది. ప్రతి మ్యాచ్ లోనూ మెవెదర్ ప్రత్యర్థి చేతిని లాగడం మామూలేనని కూడా వారు సమర్థించుకున్నారు.

  • Loading...

More Telugu News