: పపువా న్యూగినియాలో పెను భూకంపం... సునామీ హెచ్చరికలు జారీ


భూకంపాల పరంపర కొనసాగుతోంది. నిన్నటికి నిన్న నేపాల్ ను నేలమట్టం చేసిన వరుస భూకంపాలు... భారత్ తో పాటు పాకిస్థాన్ నూ వణికించాయి. భూకంపం ధాటికి నేపాల్ లో ఇప్పటికే 8 వేల మంది చనిపోగా, దేశం మొత్తం నేలమట్టమైంది. తాజాగా నేటి ఉదయం పపువా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం కారణంగా జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలు వెల్లడికాలేదు. పెను తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం నేపథ్యంలో న్యూగినియాలో అధికారులు సునామీ హెచ్చరికలను జారీ చేశారు. దీంతో పపువా న్యూగినియాతో పాటు పొరుగు దేశాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News