: పోలీసుల అదుపులో మావోయిస్టు నేత కూర రాజన్న... మరో నలుగురు మావోలు కూడా?


మావోయిస్టు అగ్రనేత కూర రాజన్నను కర్నూలు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు నగర సమీపంలోని కల్లూరు మండలం బొల్లవరం గ్రామంలో సమావేశం నిర్వహిస్తున్న రాజన్నతో పాటు మరో నలుగురు మావోలను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోల సమావేశంపై కీలక సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి, మావో నేతలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని జిల్లా పోలీసు వర్గాలు ధ్రువీకరించడం లేదు. మావో అగ్ర నేత కూర రాజన్న అరెస్టయ్యారన్న వార్తలతో జిల్లాలో కలకలం రేగింది.

  • Loading...

More Telugu News