: ఏపీ కేబినెట్ నిర్ణయాలివే...!


పది గంటలపాటు సమావేశమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్ 2 నుంచి 8 వరకు రాష్ట్ర పునర్నిర్మాణ వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 6 నుంచి ప్రాజెక్టుల వద్ద నిద్ర కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. నీరు-చెట్టు పథకం, గ్రామ సభలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. టీటీడీ బోర్డులో తుడా ఛైర్మన్ సభ్యత్వం రద్దు చేసింది. ప్రభుత్వ బదిలీపై నిషేధం ఎత్తివేసింది. ఈ-పాస్ మిషన్ల విధానం రేషన్ షాపుల్లో కొనసాగిస్తూ, కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని పేర్కొంది. మే నెలాఖరు కల్లా కొత్త మద్యం పాలసీని ఖరారు చేయనున్నారు. ఇసుక అమ్మకాలు పెంచాలని నిర్ణయించారు. జొన్నాడ మృతుల్లో మైనర్ కు 2 లక్షల రూపాయలు, మేజర్ కు 5 లక్షల రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు. మే 17 నుంచి రైతు రుణమాఫీ విజయయాత్ర చేయాలని నిర్ణయించారు. డ్వాక్రా మహిళలకు 30 శాతం రుణమాఫీ కింద 2,800 కోట్లు కేటాయించాలని, 1288 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాలని నిర్ణయించారు. జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవంగా కాకుండా నవ నిర్మాణ దీక్ష దినంగా నిర్వహించాలని నిర్ణయించారు.

  • Loading...

More Telugu News