: భర్త 'లీల'లపై ఫిర్యాదు చేసిన భార్య!


హైదరాబాదులో అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న ఓ కిరాతకుడి పాపం పండింది! వివరాల్లోకెళితే... అమీర్ పేటలో కెమిస్ట్ గా పనిచేసే శ్రీకాంత్ వివాహితుడు. ప్రేమ పేరుతో అమ్మాయిలను బుట్టలో వేసుకుని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పేవాడు. భార్యను పుట్టింటికి పంపి, తన వలలో పడిన అమ్మాయిలను ఇంటికి తీసుకువచ్చి, వారితో తన కోర్కెలు తీర్చుకునేవాడు. ఈ వ్యవహారాలను తానే వీడియో తీసి, ఆపై ఆ అమాయకురాళ్లను బెదిరించేవాడు. ఆ వీడియోలు, ఫొటోలను భార్యకు కూడా చూపుతుండడంతో ఆమె శ్రీకాంత్ వ్యవహారశైలితో విసిగిపోయింది. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, తుకారాంగేట్ పోలీసులు శ్రీకాంత్ ను అరెస్టు చేయడంతో, మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి.

  • Loading...

More Telugu News