: 60 ఏళ్ల పాపాన్ని ప్రక్షాళన చేస్తున్నాం: కేసీఆర్


ఇబ్రహీంపట్నంలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రసంగించారు. మూడున్నరేళ్లలో ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని, ఇంట్లో పైపుల ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే తల తీసేసినట్టే అని పేర్కొన్నారు. ఇక, మిషన్ కాకతీయ గురించి చెబుతూ... 60 ఏళ్ల నుంచి పూడుకుపోయిన పాపాన్ని ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పాత ప్రభుత్వాలు వదిలేసిన అనేక పనులను పూర్తి చేస్తున్నామని చెప్పారు. సన్నబియ్యం, కల్యాణలక్ష్మి వంటి పథకాలు పెట్టండని తనను ఎవరూ అడగలేదని, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి పథకాలు ప్రవేశపెట్టామని వివరించారు. అంతకుముందు, ఆయన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనకు పార్టీ కండువా కప్పారు.

  • Loading...

More Telugu News