: లక్ష్యఛేదనలో చతికిలబడిన బెంగళూరు
సొంత మైదానం చెపాక్ లో చెన్నై సూపర్ కింగ్స్ జయకేతనం ఎగురవేసింది. తొలుత బ్యాటింగ్ చేసి 9 వికెట్లకు 148 పరుగులు చేసిన చెన్నై జట్టు, ఆపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 124 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆశిష్ నెహ్రా 19 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. పాండే, బ్రావో చెరో 2 వికెట్లు తీశారు. బెంగళూరు జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. ఏబీ డివిలియర్స్ 21, దినేశ్ కార్తీక్ 23 పరుగులు సాధించారు.