: ఆ లాభాలతోనే సినిమా తీస్తా: తారా చౌదరి
టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్టు తారా చౌదరి త్వరలోనే సినిమా నిర్మాణంలోకి దిగుతున్నట్టు తెలిపారు. తనకు జరిగిన అన్యాయమే ఈ సినిమా కథాంశమని తెలిపారు. అయితే, ఆ సినిమాకు ముందు ఓ భారీ బడ్జెట్ సినిమా తీస్తానని చెప్పారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. ఇటీవల తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశానని, అందులో లాభాలు వచ్చాయని తారా చౌదరి వివరించారు. ఆ డబ్బుతోనే సినిమా నిర్మాణం చేపడుతున్నట్టు ఆమె స్పష్టం చేశారు.