: Mr, Miss, Ms తోపాటు వారికి కూడా ఓ టైటిల్!
లింగభేదాన్ని సూచించే Mr, Miss, Mrs, Ms వంటి పదాల సరసన కొత్తగా Mx అనే పదం కూడా చేరుతోంది. ట్రాన్స్ జెండర్ ను సూచించే ఈ పదం ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో చేరనుంది. గత రెండేళ్లుగా బ్రిటన్ లోని అధికారిక పత్రాలు, డేటాబేస్ లో ఈ పదాన్ని వినియోగిస్తున్నారు. బ్రిటన్ ప్రభుత్వ విభాగాలు, కౌన్సిళ్లు, యూనివర్సిటీలు, బ్యాంకులు, ఉత్తరాలు, గుర్తింపు పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సుల్లో దీనిని విరివిగా వాడుతున్నారు. దీంతో, త్వరలో రానున్న ఆక్స్ ఫర్డ్ రివైస్డ్ డిక్షనరీలో దీనిని చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మారుతున్న సమాజ అవసరాలకు తగ్గట్టు ఆంగ్ల భాషలో పదాలు మారుతున్నాయని, అవి ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో పదిలం కావడం శుభపరిణామమని డిక్షనరీ ఎడిటర్ జోనాధన్ డెంట్ పేర్కొన్నారు.