: వాజ్ పేయికి 'భారతరత్న' ఇవ్వడంపై ఒవైసీ మండిపాటు
బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయికి నరేంద్ర మోదీ సర్కారు 'భారతరత్న' ఇవ్వడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబడుతున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో వాజ్ పేయికి కూడా భాగముందని, అలాంటి వ్యక్తికి అత్యున్నత పురస్కారం ఇవ్వడం తగదని అన్నారు. ఇక, బీజేపీకే చెందిన మరో అగ్రనేత ఎల్కే అద్వానీకి పద్మ విభూషణ్ ప్రకటించడాన్ని కూడా అసద్ ప్రశ్నించారు. అద్వానీకి విభూషణ్ ఇవ్వడంలోని లాజిక్ ఏంటో తనకు అర్థం కావడంలేదన్నారు.