: శివాజీకి ఏఎస్పీ ఫోన్...దీక్ష విరమించాలని విజ్ఞప్తి
ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ గుంటూరులో ఆమరణ దీక్ష చేస్తున్న నటుడు శివాజీకి ఏఎస్పీ భాస్కరరావు ఈ సాయంత్రం ఫోన్ చేశారు. దీక్ష విరమించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే, శివాజీ అందుకు అంగీకరించలేదు. తాను దీక్ష కొనసాగించి తీరతానని స్పష్టం చేశారు. కాగా, శివాజీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. షుగర్, బీపీ లెవల్స్ సాధారణ స్థాయిలోనే ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. శివాజీ రెండు కిలోల బరువు తగ్గాడని వారు తెలిపారు.