: టోలీచౌకి వద్ద ప్రత్యక్షమైన సిగ్మా క్యాబ్స్ ఎండీ తనయుడు


హైదరాబాదులో కలకలం రేపిన సిగ్మా క్యాబ్స్ ఎండీ తనయుడు అశ్విన్ కుమార్ కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. అశ్విన్ కుమార్ టోలీచౌకి వద్ద ప్రత్యక్షమయ్యాడు. ఓ చెక్కు సంబంధిత వివాదమే కిడ్నాప్ కు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఇన్నోవా కారులో అతడిని అపహరించిన కిడ్నాపర్లు టోలీచౌకి వద్ద వదిలి వెళ్లారు. అశ్విన్ ను కిడ్నాప్ చేసిన వ్యక్తుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. లంగర్ హౌస్ పోలీసులకు అశ్విన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు.

  • Loading...

More Telugu News