: బాబా రాందేవ్ కు ట్వింకిల్ ఖన్నా మద్దతు


ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కు చెందిన దివ్య ఆయుర్వేద ఫార్మసీ రూపొందించిన పుత్రజీవక్ బీజ్ ఔషధాన్ని నిషేధించాలని పలు వర్గాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మందువాడితే మగబిడ్డ ఖాయమని ప్రచారం చేస్తున్నారని ఆయా వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై బాబా రాందేవ్ కూడా స్పందించారు. తామెక్కడా మగబిడ్డే పుడతాడని చెప్పలేదని వివరణ ఇచ్చారు. అయినా, వివాదం సద్దుమణగలేదు. ఈ వ్యవహారంలో బాబా రాందేవ్ కు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ అర్ధాంగి, నటి ట్వింకిల్ ఖన్నా మద్దతు పలికారు. దివ్య పుత్రజీవక్ బీజ్ శాస్త్రీయనామం పుత్రన్ జివా రాక్స్ బరీ అని, ఔషధానికి దానికి సంబంధించిన పేరే పెట్టారని, ఇందులో బాబా రాందేవ్ తప్పేమీ లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News