: శ్రీలంక బహుకరించిన బుద్ధ విగ్రహాన్ని సాగర్ వద్ద ప్రతిష్ఠిస్తాం: కేసీఆర్
టీఆర్ఎస్ రాజకీయ శిక్షణ శిబిరానికి ఆతిథ్యమిస్తున్న నాగార్జున సాగర్ గులాబీమయమైంది. కాగా, ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సాగర్ లోని శ్రీపర్వత రామ బుద్ధ వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీలంక బహుకరించిన బుద్ధ విగ్రహాన్ని ఈ వనంలో ప్రతిష్ఠిస్తామని చెప్పారు. రామ బుద్ధ వనాన్ని ప్రపంచస్థాయి బౌద్ధ క్షేత్రంగా రూపుదిద్దుతామని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకమైన అథారిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వెంట నేతలు, అధికారులు ఉన్నారు.