: బాబూ! మీకో నమస్కారం...మీ సహాయం ఇక మాకొద్దు!: భారత్ కు నేపాల్


'భారత్ కు ధన్యవాదాలు, భారత్ లేకపోతే నేపాల్ విలవిల్లాడేది...భారత్ చేసిన సాయం ఎన్ని జన్మలైనా మరువలేం...' ఇవి నిన్నటి వరకు నేపాల్ పలికిన చిలకపలుకులు. మరి ఇప్పుడో...'బాబూ మీకో నమస్కారం...మీరూ వద్దు, మీ సహాయమూ వద్దు...పనులు ఆపేసి మీ దేశం వెళ్లిపోండి...' అంటోంది. నేపాల్ తీరువెనుక చైనా బలమైన హస్తముంది. భారత సహాయక చర్యలు ఖాట్మాండు విమానాశ్రయం కేంద్రంగా జరుగుతున్నాయి. ఇది చైనా సరిహద్దులకు దగ్గరగా ఉండడంతో ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది. అంతే, నేపాల్ లోని మావోయిస్టు పార్టీలు భారత్ వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేయడంతోనే ఆగకుండా, అఖిలపక్షం సమావేశంలో భారత్ ను వెనక్కి పంపేయాలని నేపాల్ ప్రభుత్వానికి సూచించాయి. దీంతో నేపాల్ ప్రభుత్వం భారత్ సహాయకచర్యలకు స్వస్తి చెప్పాలని సూచించినట్టు సమాచారం. నేపాల్ లో భారత్ సహా, జపాన్, టర్కీ, ఉక్రెయిన్, యూకే, నెదర్లాండ్స్ కు సంబంధించిన సహాయ బృందాలు కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి.

  • Loading...

More Telugu News