: బెంగళూరులో కూలిన తేలికపాటి విమానం... సియోన్ ఎడ్వర్టయిజింగ్ ఎండీ మృతి


సరదాగా ఓ రౌండ్ వేసొద్దామని వెళ్తున్న విమానం ప్రమాదవశాత్తూ రన్ వేకు 300 మీటర్ల దూరంలో కూలిపోగా, అందులో ప్రయాణిస్తున్న సియోన్ ఎడ్వర్టయిజింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ రావు తీవ్ర గాయాలపాలై మరణించారు. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరు సమీపంలో జరిగింది. ఈ ఘటనలో పైలెట్ రాజీవ్ తీవ్రగాయాలతో ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎయిర్ క్రాఫ్ట్స్ ఓనర్స్ అండ్ పైలెట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గా కూడా సేవలందిస్తున్న రమేష్ బెంగళూరు ఫ్లయింగ్ క్లబ్ వ్యవస్థాపకుల్లో ఒకరు. ల్యాండింగ్ సమయంలో హై టెన్షన్ వైర్లను తప్పించేందుకు చివరి క్షణంలో చేసిన యత్నం వికటించి విమానం కూలినట్టు తెలుస్తోంది. రెండు కాళ్లూ విరిగి, భుజానికి తీవ్రగాయంతో రమేష్ ను ఆసుపత్రికి తీసుకువచ్చారని, నాలుగు గంటల శస్త్రచికిత్స నిర్వహించామని ఆయినా ఆయన్ను కాపాడలేకపోయామని మైసూరులోని బృందావన్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News