: ఆ పర్యటన ఖర్చు వెల్లడించబోము: ఆర్టీఐ దరఖాస్తుకు విదేశాంగ శాఖ సమాధానం


గడచిన జనవరి నెలలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇండియా పర్యటన సందర్భంగా ఎంత మొత్తం ఖర్చయిందన్న విషయాన్ని వెల్లడించలేమని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సమాచార హక్కు చట్టాన్ని వినియోగిస్తూ, అనిల్ అగర్వాల్ అనే ముంబై కార్యకర్త వేసిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఇది అత్యంత సున్నితమైన విషయమని, దీనికి సమాధానం ఇవ్వలేమని విదేశాంగ శాఖ చీఫ్ ప్రొటోకాల్ ఆఫీసర్ రోహిత్ రతీష్ తెలిపారు. ప్రతి సంవత్సరమూ ఇండియాకు ఎంతో మంది అతిథులు వస్తుంటారని, వారికి బస, సెక్యూరిటీ, రక్షణ ఏర్పాట్లను భారత్ స్వయంగా చూసుకుంటుందని వెల్లడించిన ఆయన ఒక్కో దేశాధినేత లేదా అతిథి వచ్చినప్పుడు ఖర్చు ఒక్కోరకంగా ఉంటుందని తెలిపారు. 2005 నాటి స.హ చట్టం సెక్షన్ 8(1) (సి) ప్రకారం సున్నిత విషయాల్లో రహస్యాన్ని కొనసాగించవచ్చన్న నిబంధనను ఆయన ఉటంకించారు. కాగా, ఒబామా పర్యటనకు అయిన ఖర్చుతో పాటు ఆయనకు భద్రతగా అమెరికా నుంచి ఎంత మంది వచ్చారు? భారత్ ఎంతమంది సైన్యాన్ని వినియోగించింది? తదితర ప్రశ్నలనూ అనిల్ సంధించగా, వాటికి కూడా సమాధానం ఇవ్వడానికి విదేశాంగ శాఖ నిరాకరించింది.

  • Loading...

More Telugu News