: ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదని మహిళా ఉద్యోగిని హత్య


తాను చేస్తున్న ఫోన్ కాల్స్ ను కావాలనే లిఫ్ట్ చేయడం లేదని ఆగ్రహించిన ఓ వ్యక్తి సహ ఉద్యోగినిని కత్తితో పొడిచి హతమార్చిన ఘటన సంచలనం కలిగించింది. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు రామ్ నారాయణ్ రామ్ సుమేర్, బాధితురాలు వాడాలోని ఒకే కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్ ప్రాంతానికి చెందినవారే. ఉద్యోగాల నిమిత్తం మహారాష్ట్రకు వలస వచ్చారు. విధులు ముగిసిన తరువాత తనను కలవాలని అతడు తరచూ అడిగేవాడని, ఆమె పట్టించుకునేది కాదని, ఒకసారి విషయం బాధితురాలి భర్తకు తెలిసి రామ్ సుమేర్ ను హెచ్చరించాడని వివరించారు. ఈ నేపథ్యంలో తాను ఎన్నిమార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపిస్తూ, ఖుప్రీ గ్రామం సమీపంలో ఆమె ఒంటరిగా నడిచి వెళ్తుంటే రామ్ సుమేర్ దాడి చేసి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాడి అనంతరం నిందితుడు పారిపోయాడని, అతని కోసం వేటాడుతున్నామని పోలీసులు తెలియజేశారు.

  • Loading...

More Telugu News