: ఆమ్ ఆద్మీ పార్టీని భూస్థాపితం చేసేందుకు మీడియాకు 'సుపారీ': కేజ్రీవాల్
ప్రసార మాధ్యమాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరోసారి పదునైన విమర్శలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని కనుమరుగు చేసేందుకు మీడియా 'సుపారీ' తీసుకుందని ఆరోపించారు. మీడియా సంస్థలను పంచాయితీకి లాగాలని కూడా అన్నారు. ఆయన క్యాబినెట్ లోని న్యాయశాఖా మంత్రి జితేందర్ సింగ్ తోమర్ తప్పుడు న్యాయ పట్టాను తయారు చేసుకున్నారని వచ్చిన వార్తల నేపథ్యంలో కేజ్రీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వార్తలు ఏ ఉద్దేశంతో వచ్చాయన్న విషయంలో మీడియా సంస్థలను విచారించాల్సిన అవసరం ఉందన్న కేజ్రీవాల్, తన పార్టీ ఇమేజ్ ని దెబ్బతీసేందుకు మీడియాలోని అత్యధికులు తమ వంతు ప్రయత్నాలన్నీ చేశారని ఆరోపించారు.