: మహా కుంభమేళాకు తరలివస్తున్న భక్తులు
అలహాబాదులో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. కుంభమేళాలో విశేష ప్రాముఖ్యం కలిగిన 'మౌని అమావాస్య' రోజున గంగానదిలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు నాగా సాధువులతో పాటు, దాదాపు మూడు కోట్లమంది అలహాబాద్ వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇందుకోసం అధికారులు బాంబు నిర్వీర్య బృందాలు, సీసీటీవీ కెమెరాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. స్నానపు ఘాట్ ల వద్ద తొక్కిసలాటలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కుంభమేళాలో ముఖ్యమైన ఆదివారం రోజున గంగాస్నానానికి ప్రముఖులు వస్తే భద్రత కల్పించలేమని అధికారులు తేల్చి చెప్పారు. కుంభమేళా సందర్భంగా ఆదివారం వాహనాల రాకపోకలను కూడా అలహాబాదులో నిలిపివేస్తారు.