: ఆ చెత్త షాట్ వెంటాడింది... రాత్రంతా నిద్రపోలేదన్న రహానే


ప్రస్తుత ఐపీఎల్ పోటీల్లో నిలకడగా రాణిస్తూ, రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్న రహానే ఓ చెత్త షాట్ ఆడినందుకు తెగ బాధపడుతున్నాడట. ఈ విషయాన్ని తనే స్వయంగా తెలిపాడు. మూడు రోజుల క్రితం ముంబైతో జరిగిన పోరులో రహానే 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వినయ్ కుమార్ బౌలింగులో క్యాచ్ ఇచ్చి ఔట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ముంబై జట్టు విజయం సాధించింది. తాను ఆడిన షాట్ చెత్తదని, అటువంటి షాట్ ఆడి ఔట్ కావడం బాధ కలిగించిందని చెప్పిన రహానే, ఆ రాత్రంతా నిద్రలేకుండా గడిపానని, జట్టు పరాజయం గురించే ఆలోచిస్తూ ఉండిపోయానని అన్నాడు. నిన్నటి మ్యాచ్ లో రహానే 91 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని సాధించి పెట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News