: ఎంపీలంతా ప్లాట్ ఫాంలపై ఉండాలా?... ‘స్టార్’ వసతి చెల్లింపులకు మురళీమోహన్ ససేమిరా!
ఎంపీలుగా గెలిచి స్టార్ హోటళ్లలో బస చేసిన మన పార్లమెంట్ సభ్యులు సదరు విలాస వసతి చెల్లింపులకు ససేమిరా అంటున్నారు. ఈ విషయంపై దేశవ్యాప్తంగా పెను వివాదం చెలరేగగా, కొందరు ఎంపీలు సదరు ఖర్చులను హోటళ్లకు చెల్లించి, సర్కారు నుంచి రీయింబర్స్ చేసుకునేందుకు సిద్ధపడగా, రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు, ప్రముఖ టాలీవుడ్ నటుడు మురళీ మోహన్ మాత్రం వితండ వాదం చేస్తున్నారు. ఎంపీలుగా మాకు ఆ మాత్రం వసతులు కూడా అవసరం లేదా? అంటూ ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. రీయింబర్స్ మెంట్ ను తాను అవమానకరంగా పరిగణిస్తానని పేర్కొన్న మురళీమోహన్, ఖర్చులు చెల్లించేదే లేదంటూ బిగదీసుకుని కూర్చున్నారు. అంతేకాక, పార్లమెంట్ సభ్యులు ఫ్లాట్ ఫాంలపై ఉండాలా? అంటూ ఆయన కొత్త తరహాలో నిరసన గళం విప్పారు.