: చైనా ప్రజలకు దగ్గర కావాలనుకుంటున్న మోదీ!
భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనీయులకు దగ్గర కావాలనుకుంటున్నారు. ఈ మేరకు చైనీయుల ట్విట్టర్ వర్షన్ 'వైబో'లోకి ప్రవేశించారు. "హలో చైనా! వైబో ద్వారా చైనాలోని మిత్రులకు దగ్గరకావాలనుకుంటున్నా" అని అన్నారు. ఇదే విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ఖాతాలోనూ వివరించారు. చైనీస్ సామాజిక మాధ్యమం వైబోలో ఖాతాను ప్రారంభించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఖాతాను ఫాలో అవాలని రిక్వెస్ట్ లు పెడుతున్న చైనీయుల సంఖ్య గణనీయంగా పెరిగి పోతున్నట్టు తెలుస్తోంది.