: టీఆర్ఎస్ నేతలకు శిక్షణ... పరమానందయ్య శిష్యులకు పాఠాలు చెబుతున్నట్టుంది: టీటీడీపీ


నాగార్జునసాగర్ వద్ద టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీటీడీపీ ఛలోక్తులు విసిరింది. ఈ శిక్షణ శిబిరం... పరమానందయ్య శిష్యులకు పాఠాలు చెబుతున్నట్టుందని ఎద్దేవా చేసింది. నైతక విలువలకు టీఆర్ఎస్ పెద్దపీట వేస్తోందని చెప్పుకుంటున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్... మరోవైపు, పార్టీ ఫిరాయింపుదారులకు పెద్ద పీట వేస్తుండటం సిగ్గుచేటని టీటీడీపీ నేత మేడిపల్లి సత్యం వ్యాఖ్యానించారు. తెలంగాణను 'సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా'గా మారుస్తామని చెప్పుకుంటున్న కేసీఆర్ కు... రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News