: పెళ్లింట చోరీ... 7 కాసుల బంగారం, రూ.70 వేల నగదు అపహరణ


ఆ ఇల్లు పెళ్లి శోభతో కళకళలాడుతోంది. ఏర్పాట్లలో కుటుంబ సభ్యులు పూర్తిగా నిమగ్నమయ్యారు. కొత్త బట్టలు, బంగారు నగలు, పెళ్లి ఖర్చుల కోసం నగదు అన్నీ సమకూరాయి. ఇదే అదనుగా చోరులు ఆ ఇంటిని పూర్తిగా దోచుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం ఎనుశెట్టివారిపాలెంలో నేటి ఉదయం వెలుగు చూసిన ఈ ఘటనలో 7 కాసుల బంగారంతో పాటు పెళ్లి ఖర్చుల కోసం సమీకరించిన రూ.70 వేలను దుండగులు పట్టుకెళ్లారు. మరి ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లను పూర్తి చేసిన ఆ కుటుంబం పెళ్లి తంతును ఎలా ముగించాలన్న డైలమాలో పడింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరుల కోసం గాలింపు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News